జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ అదనపు సంచాలకులు ఆదివారం తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఇంధన లభ్యతపై సమీక్షించారు. మొత్తం 83 పెట్రోల్ బంకుల్లోనూ సరఫరా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.