జిల్లాలో పెట్రోల్, డీజిల్ లభ్యతపై గురువారం పెట్రోల్ బంక్ యజమానులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో కలెక్టర్ అంకిత్ సమీక్ష నిర్వహించారు. అన్ని వేళలా డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉంచాలని, చమురు కంపెనీల నుంచి సకాలంలో ఇండెంట్లు పెట్టి నిల్వలు సమృద్ధిగా ఉంచుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెట్కు తరలించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.