కొత్తగూడెం: ఎండ నుంచి పోలీసు సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి

కొత్తగూడెం: ఎస్పీ రోహిల్రాజ్ మంగళవారం తన కార్యాలయంలో సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పోలీసు సిబ్బంది వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రహదారులపై, పెట్రోలింగ్, గస్తీ విధులు నిర్వర్తించే ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రానున్న బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్