జిల్లాలో ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్టరింగ్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, తప్పిదాలకు తావు లేకుండా, నిర్దిష్ట రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.