రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జూన్ 4, 6, 8, 10 తేదీలలో నిర్వహించనున్న ఈ సభల ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు.