ప్రజలకు సుదీర్ఘకాలం పాటు అంకితభావంతో, నిబద్ధతతో సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగుల సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న కె. సంజీవరావు (సీపీఓ), డాక్టర్ వెంకటేశ్వర్లు (డీవీఏహెచ్‌ఓ), చి. రమేష్‌బాబు, అంజనేయులులకు ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.