రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాధారణ ఎన్నికల పరిశీలకుడు వి. సర్వేశ్వర్ రెడ్డి సోమవారం పాల్వంచ మండలంలోని ఉల్వనూర్, బంజరా గ్రామపంచాయతీలను సందర్శించి, నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాట్లను సమీక్షించారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు అధికారులు చురుకుగా వ్యవహరించాలని ఆయన సూచించారు.