అశ్వాపురం ఎంపీడీవో గా రవీందర్ ప్రసాద్, గుండాల ఎంపీడీవో గా బాలరాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవోలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.