అశ్వాపురం మల్లెల మడుగు గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ శాఖ అధికారులు శనివారం ప్రజా బాట చేపట్టారు. గ్రామంలోని ప్రతి వీధిని సందర్శించి తక్కువ వోల్టేజ్, తరచూ కరెంటు అంతరాయం, పాత విద్యుత్ తీగలు, ట్రాన్స్ ఫార్మర్ సంబంధిత సమస్యలను గ్రామస్తుల నుంచి తెలుసుకున్నారు. గ్రామంలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నర్సింహారావు కోరారు.