అర్ధరాత్రి అశ్వాపురంలో హైడ్రా

అశ్వాపురం పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఆర్అండ్బి రహదారి డివైడర్ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, నందమూరి తారక రామారావు, దొడ్డి కొమరయ్య విగ్రహాలను ఆర్అండ్బి అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో జేసీబీల సహాయంతో తొలగించారు. అర్ధరాత్రి ఈ ఆపరేషన్ చేపట్టడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. విగ్రహాల తొలగింపునకు భారీగా పోలీసులు మోహరించారు.

సంబంధిత పోస్ట్