బూర్గంపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందిన వెంటనే ఉపసర్పంచ్ గుండె వెంకన్న, యువ నాయకులు భజన సతీష్ కుమార్ తమ అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వెంటనే పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.