ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాకుండా ఇతర వ్యాపార మార్గాలకు ఇసుక రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అక్రమ రవాణా, అనుమతి లేని రవాణా చేస్తే కేసు నమోదు చేస్తామని పినపాక తాహసిల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు. బుధవారం ఆయన పినపాక తహసిల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ రహదారులు, బ్రిడ్జిలు, ఇతర కాంట్రాక్ట్ పనులకు కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం తన వద్ద ఉందని తెలిపారు.