పినపాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న తేజస్విని సోమవారం బదిలీ అయ్యారు. ఆమెను పినపాక రేంజ్ నుండి చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా నియమిస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తేజస్విని తన సేవాకాలంలో అటవీ సంరక్షణ, అక్రమ కలప రవాణా నియంత్రణ, వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాల అమలులో చురుకైన పాత్ర పోషించారు.