బూర్గంపాడ్ కు చేరుకున్న రాష్ట్ర గవర్నర్

శనివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరుకావడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లకు సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ గెస్ట్ హౌస్ నుండి రోడ్డు మార్గాన ఆలయానికి చేరుకొని రామయ్యను దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్