పట్టణ పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తొలి విడతగా మంజూరైన లక్ష ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల పరిధిలోనే ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. ఏడాదిలోపు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అనంతరం మరో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా దూర ప్రాంతాలకు తరలించకుండా ప్రతి నియోజకవర్గంలోనే ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్