ఇల్లందు పట్టణంలోని జేకే మినీ స్టేడియం అభివృద్ధి పనులను, 11వ వార్డులోని డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం పరిశీలించారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పెండెల రాజు, పట్టణ అధ్యక్షుడు బోళ్ల సూర్యం పాల్గొన్నారు.