ఇల్లందు: నిర్వాసితులను ఖాళీ చేయమనడం అన్యాయం

ఇల్లందు విజయలక్ష్మి నగర్, ఓసీ నిర్వాసిత ప్రాంత ప్రజలను తక్షణమే ఖాళీ చేయాలని సింగరేణి అధికారులు ఆదేశించడంపై అఖిలపక్ష నాయకులు, స్థానిక సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు సింగరేణి జీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ముందస్తు సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం, బాధితులతో పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్