తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) కీలక సూచనలు జారీ చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను నియంత్రించాలని, రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున పొదుపుగా వాడుకోవాలని బోర్డు పేర్కొంది.