చెర్లగూడెం రిజర్వాయర్ పనులను అడ్డుకున్న భూ నిర్వాసితులు

నల్గొండ జిల్లా మర్రిగూడం మండలం చెర్లగూడెం రిజర్వాయర్ పనులను శుక్రవారం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన రైతులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజి రాలేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని నిర్వాసితులు వాపోయారు. ఎలాంటి సాయం చేయకుండా రాత్రికి రాత్రి ఇళ్లను ఖాళీ చేయాలంటే ఎలా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చావే శరణ్యమని పురుగుల మందు డబ్బాలతో, పెట్రోల్ బాటిల్‌తో బాధితులు నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్