జూలై 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పైప్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న ఇళ్లలో ఎల్‌పీజీ కనెక్షన్ కొనసాగించడంపై కేంద్రం పరిమితులు విధించింది. నిర్ణీత గడువులో స్వచ్ఛందంగా ఎల్‌పీజీ కనెక్షన్ సరెండర్ చేయాలని సూచించింది. అలాగే ఎల్‌పీజీ వినియోగదారులందరూ జూన్ 30లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని, లేకపోతే గ్యాస్ సేవలు లేదా సిలిండర్ బుకింగ్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.