తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేపటి నుంచి ప్రారంభించనున్న 4 పథకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపిక చేసిన గ్రామాల్లో పథకాలు ప్రారంభం అవుతాయని.. ప్రతి గ్రామంలో 4 అధికారుల బృందాలను నియమించాలని ఆదేశించారు.