కోనోకార్పస్ చెట్లను నరికేయాలన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యలపై వృక్ష శాస్త్రవేత్త, YVU మాజీ వీసీ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి స్పందించారు. అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని, ఆక్సిజన్‌ను విడుదల చేసే మొక్కలలో ఫస్ట్ ప్లేస్‌లో ఇవి ఉన్నాయని, వీటి ఆకులు తినడం వల్ల మంచి జరుగుతుందని పరిశోధనలో తేలిందన్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు.