స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. తన కెరీర్‌లో ఆయన 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో మలాగాలో జరిగే డేవిస్ కప్ ఫైనల్ నాదల్ పాల్గొనే చివరి టోర్నమెంట్ కానుంది. 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో 14 టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ రూపంలోనే నాదల్ సాధించాడు. దీంతో పాటు 2008 ఒలింపిక్స్‌లో టెన్నిస్ సింగిల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.