తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా లియోనెల్ మెస్సీ!

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై అధికారులు మెస్సీతో సంప్రదింపులు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెస్సీని అంబాసిడర్‌గా చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్