ఏపీలో లిక్కర్ ధరలు పెంపు

ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్‌ మేడ్‌, ఫారిన్‌ లిక్కర్‌, బీర్‌.. ఇలా మూడు కేటగిరీలుగా మద్యం సరఫరాను విభజించింది. ప్రభుత్వం ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతానికి పెంచింది. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెరిగాయి.

సంబంధిత పోస్ట్