తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు!

రాష్ట్రంలో మద్యం ధరలు 10 శాతం పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కారణంగా చూపుతున్నాయి. అయితే ధరలు పెరిగితే పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై అధ్యయనం చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సునీల్ కిషోర్ జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ బుధవారం నుండి మూడు రోజుల పాటు సంప్రదింపులు జరుపుతోంది. ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, చార్టర్డ్ అకౌంటెంట్ నవీన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్