మూడు రోజుల్లో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు

TG: న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. మూడు రోజుల వ్యవధిలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. DEC 29న రూ.280 కోట్లు, 30న రూ.380 కోట్లు, 31న రూ.315 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక 2024 డిసెంబర్‌ ఆఖరులో రూ.736 కోట్ల విక్రయాలు జరిగాయి.

సంబంధిత పోస్ట్