AP: లిక్కర్ కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్ అదనపు సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ IAS ధనుంజయ్ రెడ్డి, OSDగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని సిట్(SIT) అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం వీరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సిట్ కార్యాలయానికి న్యాయవాదులు చేరుకున్నారు. శనివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వీరికి శుక్రవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.