రైలు ప్రయాణంలో ఫోన్ పోతే ఇలా తిరిగి పొందవచ్చు!

రైలు నుంచి ఫోన్ జారి పడినా, చోరీకి గురైనా తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎమర్జెన్సీ చైన్ లాగకూడదు. అలా చేస్తే రూ.5,000 జరిమానా పడుతుంది. ఫోన్ జారి పడితే ఎక్కడ పడిందో గమనించి స్తంభాల సంఖ్య, సమీప గుర్తులు గుర్తుంచుకోవాలి. వెంటనే RPF హెల్ప్‌లైన్ 182, 1512, 138కు కాల్ చేసి రైలు నంబర్, కోచ్ నంబర్ వంటి వివరాలు తెలియజేయాలి. ఫోన్ దొరికితే RPF/GRP పోస్ట్‌లో ఉంచి వెరిఫికేషన్ తర్వాత యజమానికి అందజేస్తారు.

సంబంధిత పోస్ట్