దేశీయ LPG (14.2 కేజీ) సిలిండర్ ధర ఆగష్టు 1 నుంచి రూ.20-30 తగ్గే అవకాశం ఉంది. జులై 1న వాణిజ్య (19 కేజీ) సిలిండర్ ధర రూ.60 తగ్గినప్పటికీ, దేశీయ LPG ధరలో ఎలాంటి మార్పు లేదు. LPG, CNG, PNG ధరలు పెరగడం లేదా తగ్గడం మార్కెట్ పరిస్థితులు, చమురు కంపెనీల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి చమురు సంస్థలు తుది నిర్ణయం తీసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.