ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వినియోగదారుల జేబులపై ప్రభావం చూపనున్న కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ, విమాన ఇంధన ధరలను సవరించనున్నాయి. గత జనవరి 1న కమర్షియల్ సిలిండర్ ధరను రూ.111 పెంచగా, ఏటీఎఫ్ ధరను 7 శాతం తగ్గించారు. ఫిబ్రవరి 1న కూడా ధరల సవరణ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పులు నేరుగా సామాన్యులపై ప్రభావం చూపనున్నాయి.