నోబెల్‌ బహుమతి అందుకున్న మచాడో కుమార్తె (వీడియో)

వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం బుధవారం నార్వే రాజధాని ఓస్లోలో జరిగింది. మచాడో హాజరు కాలేకపోవడంతో, ఆమె కుమార్తె అనా కొరీనా సోసా బహుమతిని స్వీకరించారు. వీడియో సందేశం ద్వారా మచాడో మాట్లాడుతూ, ఈ బహుమతి వెనెజువెలా ప్రజలకు అంకితమని తెలిపారు. వెనెజువెలా అటార్నీ జనరల్, మచాడో దేశం విడిచి వెళితే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్