కరుప్పు సినిమా నిషేధంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టివేసింది. కోర్టుల్లో అవినీతిని చూపించినంత మాత్రాన సినిమాను నిషేధించలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. గతంలోనూ, ఇప్పుడు కూడా అవినీతి జడ్జిలు ఉన్నారని, సినిమాలో చూపించిన కోర్టు ఊహాజనితమైనదని, దీనికి కోర్టు ధిక్కరణ చట్టం వర్తించదని కోర్టు పేర్కొంది. సినిమాను నిషేధించాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.