అలంపూర్ మున్సిపల్ కేంద్రంలో గత 25 సంవత్సరాలుగా అటెండర్ గా విధులు నిర్వహించిన మరియమ్మ నేడు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్ పాల్గొని, ఆమె సమయపాలన, సేవలను ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, మరియమ్మ సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.