అలంపూర్ వార్డు సభలు: సమస్యల పరిష్కారానికి అధికారులు సిద్ధం

అలంపూర్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో గురువారం ఉదయం 9:30 గంటల నుండి వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శంకర్ తెలిపారు. ఈ వార్డు సభల ద్వారా ప్రజలు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి వినతి పత్రాల రూపంలో తీసుకురావాలని ఆయన కోరారు. గతంలో నిర్వహించిన ప్రదేశాలలోనే ఈ సభలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్