గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష నేడు అలంపూర్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డ్ లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో సమస్యలుంటే మున్సిపల్ కమిషనర్ కు తెలపాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యమైన భోజనం అందించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, కమిషనర్, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.