దేవరకద్ర: తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

భూ భారతి రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15వ తేదిలోగా పరిష్కరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ దరఖాస్తులను పరిశీలించారు. తహశీల్దార్ కార్యాలయంలో భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్