మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని లక్షింపల్లి గ్రామానికి వెళ్లే రహదారి అద్వాన స్థితిలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ ఈ రోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఎన్నికల ముందు మాత్రమే ఓట్ల కోసం వచ్చే ప్రజా ప్రతినిధులు, కనీసం రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని, ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.