మహబూబ్ నగర్: రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు..!

మహబూబ్ నగర్ జిల్లాలో రైల్వే డబ్లింగ్, విద్యుద్దీకరణ పనుల కారణంగా ఈ నెల 10 నుంచి 19 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. మహబూబ్ నగర్-మన్యంకొండ మధ్య పనులు జరుగుతున్న నేపథ్యంలో కాచిగూడ-రాయచూర్, కర్నూలు సిటీ, గద్వాల్, గుంతకల్, బోధన్ మార్గాల్లో నడిచే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్