మహబూబ్ నగర్ జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నేపథ్యంలో కర్నూలుసిటీ-కాచిగూడ (17024) తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకల్లో మార్పులు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఈనెల 13, 15, 17 తేదీల్లో ఈ రైలు 120 నిమిషాలు (2 గంటలు) ఆలస్యంగా నడుస్తుంది. రైల్వే భద్రత, సామర్థ్యం పెంపు కోసం ఈ నిర్ణయం తీసుకోబడింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని చేసుకోవాలని సూచించారు.