మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం పరిశీలించారు. ఇంటి యజమాని పావనితో మాట్లాడి, బిల్లులు సక్రమంగా వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటిని నాణ్యతతో నిర్మించాలని సూచించారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి సంబంధించిన నిధులను దశల వారీగా విడుదల చేస్తుందని తెలిపారు.