మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ, రాజీ మార్గమే రాజమార్గమని, శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, వాహన ప్రమాద కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని, తద్వారా కోర్టు ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవాలని సూచించారు.