మహబూబ్ నగర్: జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 30 సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని బుధవారం ఎస్పీ జానకి తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

సంబంధిత పోస్ట్