మహబూబ్ నగర్: ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు పోలీస్ యాక్ట్ 30, 30(A) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి. జానకి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్