మహబూబ్ నగర్: మున్సిపల్ ఎన్నికల భద్రతపై ఎస్పీ నిఘా

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎస్పీ డి. జానకి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల వేళ ప్రత్యేక నిఘా కొనసాగించాలని, భద్రతలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్