కౌకుంట్ల కు నూతన ఎమ్మార్వో కార్యాలయం మంజూరు: ఎమ్మెల్యే

దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండల కేంద్రానికి నూతన ఎమ్మార్వో (తహసీల్దార్) కార్యాలయ భవనం మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నిరంతర కృషితో ఈ భవనం మంజూరైంది. దీంతో మండల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఈ అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, కార్యాలయ భవనం మంజూరుకు కృషి చేశారు. కౌకుంట్ల మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్