జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు బుధవారం అయిజ పట్టణంలోని న్యూగంజిలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సైదులుతో చర్చించి, నామినేషన్లు శాంతియుతంగా, సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలు సహకరించాలని ఎస్పీ సూచించారు.