గద్వాల: ఉత్తమ సేవలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది: ఎస్పీ

నూతన సంవత్సర సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులకు మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ టి. శ్రీనివాసరావు చేతుల మీదుగా పతకాలు అందజేశారు. సీసీఎస్ ఎస్ఐ చంద్రశేఖర్, మానవపాడు ఏఎస్ఐ వెంకటప్రసాద్, రాజోలి పోలీస్ స్టేషన్ ప్రేమ్ కుమార్ లకు ఈ పురస్కారాలు లభించాయి. ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఉద్యోగికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్