జడ్చర్ల: బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటనపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడతానని తెలిపారు. బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్