మహబూబ్ నగర్: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యంవద్దు

మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బోయి, ప్రజావాణిలో ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మండల వారీగా పరిష్కారం అయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలని, అత్యవసరమైతేనే కలెక్టరేట్ కు రావాలని ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్